నీ ఆలోచననల ప్రవాహం నన్ను ఇలా
మోసుకుపోనీ నీ ఊహల తీరం వరకూ
నీ కన్నుల చూపుల వలలో నన్ను లాగు
నీ మది గది వరకూ, కారణం నీ మాట
నీ పాట అని నే నీగూర్చి పలికే వరకూ
నాకు నువ్వు కలలో అందిన ఓ
అందాల సుందరివి , నీ గూర్చి
నేను ఏనాడైనా ఎప్పుడైనా
తప్పుగా తలచానా నీకు నా
ఆలోచన మీద ఎందుకు
అనుమానం... నా మీద నీకున్న
నమ్మకం గూర్చి... నీ ఆలోచన
ఆ సాయంత్రం నీ కౌగిలి కావాలన్నాను
నీ పెదవి మధురిమ కావాలన్నాను
నీ దగ్గరి తనాన్ని... నీ ముద్దునీ
నేను కోరాననీ... నీకు కోపమా
అనుక్షణం నీ ఆలోచన నా మదిని
తొలుస్తూవుంటే నేను నీవు గాక మరేమిటి
nice one..
రిప్లయితొలగించండిIts good.....
రిప్లయితొలగించండిnice to read
రిప్లయితొలగించండిశ్రవణ్ కుమార్ గారూ, పద్మార్పిత గారూ, టాపర్ గారూ
రిప్లయితొలగించండిఇది నా తొలి ప్రయత్నం జాలం లో, కొత్త బ్లాగరిని మీరంతా నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చారు
మీ పలుకులు ఉత్సాహాన్ని ఇచ్చాయి
మీకు అందరికీ నా నెనర్లు.