నీతో ఉన్న కొన్ని క్షణాలు నన్ను నేను మరచిన సమయం
నీవు అలా నా పక్కనున్నంత కాలం నాకు ఏమీ తోచదు
నీ చేతులు నన్ను వెదికినప్పుడు నాలో ఏదో మార్పు
అదేమిటో నాలో ఇన్నాళ్ళూ దాగిన కోరిక రెక్కలు విప్పింది
నీ అందాలన్నీ అందుకోవాలని నాకు ఆశ కలిగింది
నీకూ నాకూ అలా దూరం లేని క్షణాలు దగ్గరగా వున్నాయా?
నువ్వలా ఒదిగి పోతే నీ చనువు సాహచర్యం అందించే వెచ్చదనం
మరెక్కడైనా వుంటాయంటే నేనెలా నమ్మేది? ఈ చిన్న మెరుపు చాలు నా జీవితానికి
కొన్ని జన్మలకు నేను నెమరు వేసుకోటానికి ఈ జ్ఞాపకాలు చాలు ఈ మది గదికి
మెరుపు క్షణమే అయినా వచ్చే వెలుగు కళ్ళని కమ్మేస్తుందని తెలుసా నీకు
నీకూ నాకూ అలా దూరం లేని క్షణాలు దగ్గరగా వున్నాయా?
రిప్లయితొలగించండిమెరుపు క్షణమే అయినా వచ్చే వెలుగు కళ్ళని కమ్మేస్తుందని తెలుసా నీకు
baagunnayi mee peru telusukovacha
శ్రవణ్ కుమార్ గారూ
రిప్లయితొలగించండిమీ పలుకులు ఉత్సాహాన్ని ఇచ్చాయి
మీకు నా నెనర్లు.
నా గూర్చిన వివరాలు త్వరలోనే ..