నీ వెచ్చని స్పర్శ నీ తీయని నవ్వు మిలమిల లాడే నీ
నవ్వే కళ్ళు నా ఎదురుగా నిలిచి నా నిద్రని దూరం చేసాయి
చల్లని సాయంత్రం నీవు నా వెంట నా మనసు నీ వెంట
కలిసి మనం పంచుకున్న క్షణాలన్నీ వెన్నెల వెలుగులో
కలిసి పోయి చీకటి నీడల మాటున మౌనంగా ఆగాయి
నేను మాత్రం నీడల ఊడలని ఊపి వాటిని ఏరుకుందామని
నీ కోసం కలవరిస్తూ వేయి వెర్రి ఆశలతో నిలుచున్నా
మీ ఆలోచనలలాగే పదకూర్పులు కూడా చదవగానే ఆకట్టుకొంటున్నాయి. విలక్షణంగా వుందనిపించింది.
రిప్లయితొలగించండిఇలా రాస్తూపోండి, మీశైలిలో మెళుకువలు మీకే త్వరలోనే తెలుస్తాయి.
భాస్కర రామి రెడ్డి గారూ !
రిప్లయితొలగించండిచాల మంచి వాక్యాలు చెప్పారు.
మీ ప్రోత్సాహం ఎనలేనిది
మీ సూచనల్ని శిరసావహిస్తాను
మీ కవితలు చాలా బాగున్నాయి...
రిప్లయితొలగించండిమరమరాలు గారూ
రిప్లయితొలగించండిమీ వ్యాఖ్యలు కొత్త ఊపిరిని ఇచ్చాయి