ఎందుకనీ నే నీతో గడిపిన క్షణాలన్నీ ఒకటొకటే నా ఎదురుగా
నిలబడి మనకు మాత్రమే తెలిసిన రహస్యాలని గుర్తుచేస్తున్నాయి?
కుదురుగా నేనీవేళ కూచుని నెమరు వేసుకుంటే తెలిసింది
నీవు నా ఎద మీద ఒదిగి నా మది చప్పుడు విని కిలకిలమని
మరొకసారి గుండె పై చేయి వేసి నీ మాటల అలికిడి విని
నిజమా అని ఏమీ తెలియనట్టు నీ కళ్ళని రెపరెపలాడించి
నా గుప్పెడు గుండెను నీ గుప్పెటలో బంధించి మరిపించావని
అంతేనా! నవ్వుల జల్లులను కురిపించి నన్ను నిలువునా
కమ్ముకున్నావు పూల సుగంధంతో కలిసిన వెన్నెల వెలుగులా!!
తనివితీరని తీయని తలపులు నాకు మిగిల్చి నీవు మాత్రం
చిత్రమైన ఒక చిరునవ్వు విసిరావు అచ్చం ఆ జాబిలిలా ...

అందని జాబిలి అందెల సవ్వడి నీకు అర్దం కాలేదా, తానిక దొరకదని. బాగుంది నేస్తమా చాలా బాగా రాశావు.
రిప్లయితొలగించండిహను గారూ
రిప్లయితొలగించండిమీ వ్యాఖ్య బావుంది. మీరు నా బ్లాగు ని సందర్శించి స్పందించినందుకు ధన్యవాదాలు.