నువ్వొక అందమైన అద్భుతానివి నా జీవితంలో
నువ్వలా నా పక్కనుండి చిరునవ్వుల వెలుగులో
మన ఎదురుగా వున్న నిజాలని లోతుగా చూపుతావు
కలల సారధివై ఓ కొత్త ప్రపంచాన్ని ముందు నిలుపుతావు
మనసుని తడిమి వింతగా నిద్రను దూరం చేస్తావు
నా ఆలోచనల అలలను చూసి అలవోకగా నవ్వుతావు
రహస్యంగా ముగ్ధమనోహరంగా కళ్ళతో పలకరిస్తావు
ప్రతి సాయంత్రం ఓ మల్లెల వసంతాన్ని మోసుకొస్తావు
మంచి కవితను అందించారు.
రిప్లయితొలగించండిvery nice
రిప్లయితొలగించండివిజయమోహన్ గారికి,
రిప్లయితొలగించండిసుజ్జీ గారికి
నా ధన్యవాదాలు