నాకు తెలుసు ప్రియతమా ఏదో ఒక రోజు మనమిద్దరం మమేకం అయినప్పుడు
నీవు చేసిన మాయ నీకు తెలియదు కానీ నాకు మాత్రం తెలుస్తుంది
మనం పంచుకున్న మధురానుభూతులన్నిటినీ కలగలిపి
మనకందరికీ తెలిసిన పేర్లను నిర్ణయించమంటావని అనుకున్నా
నీకు నాకు ఇది ఒక కొత్త జన్మ అనుకుందామా? లేక
మనమిద్దరం రాబోయే జన్మ కోసం ఎదురుచూద్దామా?
మనం క్షణకాల జీవితంలో మెరుస్తున్న మెరుపులను ఓ సారి
దోసిటలో ఒడిసి పట్టుకుందామా?
తెలియని గమ్యాలను వెతుకుతూ అర్థం కాని
బతుకు నుడికట్టులని పూరిస్తూ రేపటి క్షణాలను
మన మధ్య తరిగే దూరానికి మైలురాళ్లుగా మారుద్దామా
బాగుంది..
రిప్లయితొలగించండిఅనిల్ గారూ
రిప్లయితొలగించండిమీకు నా ధన్యవాదాలు
పదాలతో పట్టుకోవాలని ప్రయత్నం!!
రిప్లయితొలగించండిమీరు అందులో విజయం సాధించారు..అభినందనలు