సాయంత్రం చూస్తూండగానే చీకటిగా మారి ఊహల ద్వారాలను తెరిచింది
కదిలే కాలం జ్ఞాపకాలను స్వప్నాలుగా మార్చి కనుల ముందు నిలిపింది
రెప్ప వెనకాల ఉబికిన నీటి చుక్క నిజాలవేడిని తట్టుకోలేక ఆవిరయ్యింది
నీ మౌనంతో పదునెక్కిన వలపుబాకు గాయాన్ని మిగిల్చి మాయమయ్యింది
కలసివున్న క్షణాలను మరిక కలవమేమోనన్న అనుమానం కరిగించింది !
అబద్దంతో నేను... నిజంతో నీవు ...ఎప్పటికీ కలవలేని జీవన సమాంతర రేఖలం
మనకిద్దరికే చెందిన ఓ లోకంలో కలవాలని ప్రయత్నించే వెర్రి బాటసారులం కాదా??
త్రాటికి రెండు వైపులా రేగిన నెగడు
రిప్లయితొలగించండిపయనించే దారి పరస్పరం వ్యతిరేక మయినా..
చివరకు కలవక మానవు.
ఆ కలిసిన తరుణంలో ఆ మంట మోసిన
హృదయాలు మసిగా మిగిలిపోతాయి.
రగిలిన మంటకుగానీ.. చేసిన పయనాకికీ..
పర్యవసానం.. గుప్పెడు మసి..
చాలా బాగుందండి. అబినందనలు.
hmmm both one nice :))
రిప్లయితొలగించండిఒక రిక్వెస్ట్. ఈ వార్త పైన ఒక కవిత వ్రాయగలరా?
రిప్లయితొలగించండిAuto Prakash1
Auto Prakash2
Interesting
రిప్లయితొలగించండిమీవి మొత్తం ఒక్కటి ఒక్కట్గా చదువుతున్న చాల బాగా రాస్తున్నారు .ప్రతిది మనసుని తాకుతుంది .
రిప్లయితొలగించండి