దూరాలను కొలిచే యంత్రాలను చూసా గానీ సృష్టించే తంత్రాలను నేనెరుగను
మనసులు కలిపే మాటలను విన్నాగానీ దూరమయ్యే తూటాలను ఎరుగను
కనులను కలిపే చూపులను ఎరుగుదును కానీ విడదీసే సైగలు తెలియదు
మన ఇద్దరి మధ్య దగ్గరితనాన్ని చూసా గానీ దూరాన్ని నే చూడలేను
అందుకే మనమిద్దరమూ పెదవులమాటున దాగిన నీ తీయని కలను
నా మదిలో దాగిన ఊసులను ఈ సాయంత్రం కలిసి పంచుకుందాం ప్రియా
బాగుంది.
రిప్లయితొలగించండిఈ పోస్టు నేను చూడను. రేపొస్తా.. వివరాలు వివరంగా రాయండి. సరే !? అదేనండీ ఇలాగే మంచి ఫీలున్న కవితలానే !! చీ యూ టుమారో !!
రిప్లయితొలగించండిii word verification evaDu kanipeTTaaDanDii baabuu...
"ఈ పోస్టు నేను చూడను. రేపొస్తా.. వివరాలు వివరంగా రాయండి.."
రిప్లయితొలగించండికొద్దిగా వివరిస్తారా? నేను మారుస్తాను మీ సూచనల మేరకు గతంలో లాగా..
కామెంటానంటే పోస్టు చూసినట్టే కదా !? ఇలానే మంచి ఫీలున్న కవిత అంటే ఈకవిత బాగుందని కదా !? "నా మదిలో దాగిన ఊసులను ఈ సాయంత్రం కలిసి పంచుకుందాం" అన్నారుకదా.. ఆవివరాల గురించి మరో కవిత రాస్తారేమో.. అది చదవడానికి మళ్ళీ వస్తాను అని.
రిప్లయితొలగించండిఈ కవితలో మార్చాల్సిన దేమీలేదు.. చాలా బాగుంది. అభినందనలు.
ధన్యవాదాలు ఆత్రేయ గారూ.
రిప్లయితొలగించండి