నిన్న వెన్నెల నీడలలో నువ్వు సిగ్గుపడి మరచిన
ఓ లేత మొగ్గ నా దగ్గరే వుంది వయ్యారంగా వగలుపోతూ
చటుక్కున మెరుపులా నీ పెదవి మీద మెరిసిన నవ్వులాగా
తెలియని మత్తుని నా మదికందించి నెమ్మదిగా రెప్పలు
విప్పార్చి విచ్చుకుంటోంది ఏమీ ఎరుగనని చెప్పే నీ
నులివెచ్చని చూపుల స్పర్శ పలకరించినట్టే అచ్చంగా
మీ కవితలో భావాలు సుందరంగా పలుకుతున్నాయి. ఒక చిన్న మనవి. ఏలైను కాలైను కాకుండా మొత్తంగా గద్యంలా చదివితేనే బాగుందనిపించింది.
రిప్లయితొలగించండి