6, మే 2009, బుధవారం

కాలం ఆవిరైపోతూ

నా ఎదపై నీ తలవుంచి
నా గుండె చప్పుడు విని చూడు
పలుకుతున్న నీ గొంతే వినిపిస్తుంది
ఎదురుగా అద్దం లోకి చూడు
నీ కను పాపల వెనుక మనమిద్దరం
కన్న కలలన్నీ కదుల్తాయి
నీవు ఒంటరిగా ఉన్నపుడు
నా మాటలే నిన్ను పదే పదే పలకరిస్తాయి
మనమిద్దరం కలసి పంచుకున్న కాలం ఆవిరైపోతూ
నీకూ నాకూ మధ్య తరగని దూరాన్ని
కరిగించాలని తపనగా తనవంతుగా
కొత్త గమనాలను సరికొత్త గమ్యాలను
చూపి నెమ్మదిగా మాయమయ్యింది
నేను మాత్రం నిన్న నీవు వొదిలిన జ్ఞాపకాల మధ్య
నీ నవ్వులను ఏరుకొంటూ తప్పిపోయాను

4 కామెంట్‌లు:

  1. good one
    "ఎదురుగా అద్దం లోకి చూడు
    నీ కను పాపల వెనుక మనమిద్దరం కన్న కలలన్నీ కదుల్తాయి"...liked this line much.

    రిప్లయితొలగించండి
  2. రాధిక గారూ
    మీ వ్యాఖ్య తో నన్ను ప్రోత్సాహించినందుకు మీ నా ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  3. రాధిక గారూ క్షమించాలి
    ఇందాక అక్షర లోపం వచ్చింది
    మీ వ్యాఖ్య తో నన్ను ప్రోత్సాహించినందుకు మీకు నా ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  4. wonderfull sir....
    Very sweet expressions
    I tried to put such emotions on paper but I ma sure I cant express like this...

    రిప్లయితొలగించండి